ప్రజల మనసులను గెలుచుకుంటున్న బొల్లా
మండల ప్రజల్లో పెరుగుతున్న జనాదరణ
విశాలాంధ్ర- వత్సవాయి: మండలంలోని మండలం తాళ్ళురు గ్రామంలో పఠాన్ హసేన్ సాహెబ్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది గా ఉందని తెలుసుకొని వారి గృహానికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయంగా 10,000/- రూపాయలను రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ వైద్యం నిమిత్తం వారికి అందించారు… నియోజకవర్గం స్థాయిలో ఆపదలో ఎవరైనా ఉన్నారని తెలిసినట్లయితే తన వంతు సహాయంగా ముందుండి నడిపించడంతో నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు బొల్లా రామకృష్ణ..
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రసాదపు గోపాల్ రావు మాజీ ఉపసర్పంచ్ సొంద్ మియా ఐదో వార్డ్ మెంబర్ ప్రసాదపు రమేష్ టిడిపి సీనియర్ నాయకులు ప్రసాదపు శ్రీనివాసరావు బొల్లా లక్ష్మణరావు పఠాన్ హుస్సేన్ పఠాన్ ఫిరోజ్ గంగవరపు హరికృష్ణ షేక్ జానీ బొల్లా వెంకట సాయి వేమవరం తెలుగు యువత నాయకులు కాకాని గిరిధర్ తదితరులు పాల్గొన్నారు