Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఏఐవైఎఫ్ జనరల్ బాడి సమావేశాన్ని జయప్రదం చేయండి.

జిల్లా అధ్యక్షులు లంకా గోవింద రాజులు

నందిగామ : ఏప్రియల్ 2న నందిగామ లో నిర్వహించనున్న అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జనరల్ బాడి సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు లంకా గోవింద రాజులు కోరారు.
సోమవారం స్థానిక జగ్గయ్య పేట అర్ టి సీ డి పో ఎదురుగా గల పిల్లల మర్రి వెంకటేశ్వర రావు భవన్ లో కరపత్రాలు విడుదల చేసారు.ఈ సందర్భంగా గోవింద రాజులు మాట్లాడుతూ యువతలో ప్రగతి శీల అభ్యుదయ భావాలను దేశ భక్తి,ప్రజాస్వామిక,విలువలని మానవత్వాన్ని , నైతిక విలువలను మెలుకొల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య నిరంతరం కృషి చేస్తున్నదని అన్నరు.
భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు లాంటి అనేక మంది అమరుల స్పూర్తితో 1959 మే 3న ఆవిర్భవించిన అఖిల భారత యువజన సమాఖ్య కథ 64 సంవత్సరాలుగా విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉపకార వేతనాలు విడుదల కోసం, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జాబ్ అర్ జైలు పనైనా చూపండి తిండి అయినా పెట్టండి అని నినాదాలతో దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని మెగా డీఎస్సీ నిర్వహించాలని పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, గుట్కా తింటే గుటుక్కుమంటవ్ హలో యువత మేలుకో మత్తు పదార్థాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అంటూ అనేక రకాల చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పోటీ పరీక్షల్లో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా అనేక రకాల మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా సమరసిల ఉద్యమాలకు పతాకగా అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ పనిచేస్తుందని ఈ తరుణంలో ఏప్రిల్ 2 న నందిగామ చంద్ర రాజేశ్వరరావు భవన్ లో నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల జనరల్ బాడీ సమావేశ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు ఎండ్రపల్లి భాను, నాయకులు జోజి, అంజి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img