Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

గూడూరులో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాలాంధ్ర- గూడూరు : పెడన నియోజకవర్గం గూడూరు మండలం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గూడూరు శాఖ గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌ మోటే పల్లి రత్నారావుని, సన్మానించడం జరిగింది. రత్నారావు మొదటగా గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మోటే పల్లి. రత్నారావు మాట్లాడుతూ, అయ్యంకి వారు ఎన్నో గ్రంథాలయాలను స్థాపించారని, గ్రంథాలయం దేవాలయం అని ఉచితంగా పుస్తకాలు చదివి మంచి వృద్ధిలోకి రావాలని విద్యార్థులను ఆకాంక్షించారు. అనంతరం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ ఉపాధ్యాయులు ఖాదర్‌ మస్తాన్‌, డి ఎన్‌ వి గోపి బాబు, నిర్వహణలో ‘‘ మారకద్రవ్యాల నిర్మూలన’’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వహకులు వై శ్రీనివాసరావు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img