Monday, February 6, 2023
Monday, February 6, 2023

గ్రామ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం- గ్రామ సర్పంచ్

     విశాలాంధ్ర- గూడూరు: గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో ఆశా వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందిస్తున్న గ్రామ సర్పంచ్ యక్కల మాధవి నాగరాజ్ మరియు మల్లవొల్లు పీహెచ్ డాక్టర్ శివరామకృష్ణ , విహెచ్ఎన్ఎస్సీ కమిటీ సభ్యులు వార్డ్ మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు. ఈ సందర్భంగా సర్పంచ్  మరియు డాక్టర్ మాట్లాడుతూ గ్రామంలో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రివర్యులు ప్రవేశపెడుతున్న విలేజ్ హెల్త్ ఫిజీషియన్ సక్సెస్ ఫుల్ గా గ్రామస్తులుకు అందజేయాలని, గ్రామస్తుల ప్రతి ఒక్క కుటుంబ డేటా మీ చేతుల్లో ఉండాలని, గర్భిణీలు బాలింతలు మరియు పిల్లలు రక్తహీనత సమస్య లేకుండా చూడాలని, కొత్తగా చేరే ఆశా వర్కర్లైన ఉల్లంకి సుశీల మరియు తిరుపతి కమల కుమారి  గ్రామ ఎం ఎల్ హెచ్ పి మరియు ఏఎన్ఎం  సూచనలకు అనుగుణంగా గ్రామ ప్రజా ఆరోగ్యమే ముఖ్యంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా విలువైన సూచనలు ఇస్తూ శ్రమించి పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన మన మంత్రివర్యులు జోగి రమేష్ కి గ్రామస్తులు మరియు సర్పంచ్  ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img