Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

జగనన్న క్రీడా సంబరాలు బ్రోచర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను

విశాలాంధ్ర – జగ్గయ్యపేట : పట్టణంలో ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగబోయే జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో జగనన్న క్రీడా సంబరాల బ్రోచర్ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వవిప్‌ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ఇండోర్‌ స్టేడియంలో నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలు ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. అదేవిధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగనన్న క్రీడా సంబరాలకు 17 సంవత్సరాలు పైబడిన పురుషులు,స్త్రీలు ఎవరైనా సరే ఉత్సాహంగా ఉన్నవారు కబడ్డీ,వాలీబాల్‌,క్రికెట్‌,షటిల్‌ బ్యాట్స్మెన్‌ లాంటి క్రీడలకు పేర్లు నమోదు చేయించుకోవచ్చు అని తెలిపారు.నియోజకవర్గస్థాయిలో గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయిలోనూ ఆడిరచి ఆ తర్వాత జిల్లా స్థాయిలో గెలిచిన విజేతలు మరల రాష్ట్రస్థాయిలోనూ ఆడిరచి చివరకు డిసెంబర్‌ 21వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆరోజు రాష్ట్రస్థాయిలో గెలుపొందిన విజేతలకు 50 లక్షల రూపాయలు ప్రైజ్‌ మనీ ని కూడా అందించడం జరుగుతుందని తెలిపారు, కావున క్రీడల్లో ఉత్సాహవంతులైన యువతీ యువకులు ఎవరైనా ఉంటే జగనన్న క్రీడా సంబరాలు మండల ఇంచార్జ్‌ శ్రీనివాస్‌ 7013419902, గంటా వెంకటేశ్వర్లు 9948225132 లను సంప్రదించవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img