Monday, June 5, 2023
Monday, June 5, 2023

జగన్ రెడ్డి దరిద్ర పాదంతో నాలుగేళ్లుగా రైతులకు ఒక్క పంటా కలిసి రాలేదు: మాజీ మంత్రి దేవినేని ఉమా..

విశాలాంధ్ర రూరల్-నందిగామ : జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐనప్పటినుండి రైతులకు ఒక్క పంట కలిసి రాలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు సోమవారం నందిగామ మండలం లింగాలపాడు లో దెబ్బతిన్న పంటలను మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి దరిద్రపాదంతో నాలుగేళ్లుగా ఒక్కపంట రైతుకు కలిసి రాలేదని రైతులు బాధ పడుతున్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి రైతు శ్రేయస్ కొరకు చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాలలో పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీసే వరకు గోనెసంచులు,పట్టాలు కూడా ఇవ్వలేదని రైతుల ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు పంట మునిగింది పరిహారం ఇవ్వండి అంటూ రైతుల పక్షాన తెలుగుదేశం పోరాటం చేస్తుందని,నాలుగేళ్లుగా ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు,ప్రకృతి వైపరీత్యాల నిధి 4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు,చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఇంత పెద్ద ఎత్తున దెబ్బతింటే పరదాల ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటకు రావడం లేదని రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు,దెబ్బతిన్న, తడిసిన, మొలకెత్తిన పంటలను చంద్రబాబు పరిశీలించే వరకు ప్రభుత్వంలో అధికారుల్లో కదలిక లేదని,16 జిల్లాలలో లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింటే 60 వేల ఎకరాలు అంటూ తప్పుడు లెక్కలు చెప్తారా,దెబ్బతిన్న మొక్కజొన్న, ధాన్యం, సహా వాణిజ్య పంటలకు ఎందుకు బటన్ నొక్కడం లేదని ప్రశ్నించారు,పక్క రాష్ట్ర దళారీలకు రైతుల కష్టాన్ని దోచిపెడుతున్నారనీ,ఇంతవరకు మార్క్ ఫెడ్ ను ఎందుకు రంగంలోకి దించలేదని,మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి, మామిడి సహా అన్ని వ్యవసాయ హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయనీ,నాగార్జున సాగర్ నిండినా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, జనవరి లోనే నీళ్లు ఆపేసి,దాల్వా పంటను ఎగ్గొట్టేశారని, బావులు,బోర్లు క్రింద కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదనీ అన్నారు,సుబాబుల్ 5 వేలకు కొనుగోలు చేస్తామంటూ గాంధీ సెంటర్లో డబ్బా కబుర్లు చెప్పిన వాళ్ళు నేడు ఏమయ్యారని,మార్కెట్ లో డిమాండ్ ఉన్నా రైతుల చేతికి రాకుండా దళారులు దోచేస్తున్నారని,చంద్రబాబు క్షేత్రస్థాయిలో పొలాల గట్టులపై తిరుగుతుంటే ఆయన వయసును ఎగతాళి చేసిన జగన్ రెడ్డి తాడేపల్లి పిల్లి మాదిరిగా బయటికి రావడం లేదని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ప్రభుత్వ సహాయం అందజేయాలని అలాగే తక్షణమే తడిసిన మొక్కజొన్న, ధాన్యం సహా దెబ్బతిన్న అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తంగిరాల స్వామి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు ఏచూరి రాము,వీరంకి వీరస్వామి,తోట నాగమల్లేశ్వరరావు, ఉమ్మినేని విక్రమ్, అమ్మినేని జ్వాల ప్రసాద్, ఉన్నం అప్పారావు పెద్ద ఎత్తున తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img