Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

త్వరలో పట్టాలను ఏర్పాటు చేస్తా

ఆర్డీఓ ఐ.కిశోర్‌
విశాలాంధ్ర`గూడూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్‌ ఆదేశాల ప్రకారం, శుక్రవారం కృష్ణాజిల్లా ఆర్డీఓ ఐ.కిషోర్‌ను మండల ఎం.ఆర్‌.ఓ బి.విజయ ప్రసాద్‌,వి.ఆర్‌.ఓ వరప్రసాద్‌లతో కలిసి యక్కల.నాగరాజు గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో పాత లేఔట్‌ పట్టాలకు సంబంధించి కలిశారు. గతంలో ఇచ్చిన పట్టాల గురించి వివరించిన పిదప ఆర్డీఓ ఐ.కిషోర్‌ త్వరలో పట్టాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్‌ పట్టాలతో పాటు బిల్డింగ్‌ శాంక్షన్‌ కూడా వెంటనే చేయిస్తానని చెప్పినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అధికారులతో , కప్పలదొడ్డి గ్రామం పాత లేఅవుట్లు గురించి అధికారులకు వివరించిన మండల జడ్పిటిసి వేముల సురేష్‌ రంగబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 183 ఇళ్ల జగనన్న లేఅవుట్‌ బడుగు, బలహీన వర్గాల కల అతి తొందరలో పూర్తి అవ్వాలని గ్రామ సర్పంచి, వార్డ్‌ మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు గ్రామస్తులు లబ్ధిదారులు అందరూ ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img