Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

నిబంధనలకు విరుద్ధంగా వత్సవాయి తహసిల్దార్ నియామకం

విశాలాంధ్ర-వత్సవాయి : మండల తహసీల్దార్గా వైకుంఠ రావును నిబంధనలకు విరుద్ధంగా నియామకం చేయటంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ భూ పరిపాలన శాఖ కమిషనర్కు వత్సవాయి గ్రామానికి చెందిన చింతా శ్రీనివాసరావు కోరారు. సి సి ఎల్ ఏ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లకు పంపిన ఫిర్యాదు లేఖలనుచింతా శ్రీనివాసరావు పాత్రికేయులకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న తహసీల్దారులు స్థానికు లైన వారు డివిజన్ లోనీ మండల కేంద్రాలలో పనిచేయరాదని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ నిబంధనలకు విరుద్ధంగా కొద్ది నెలల క్రితం జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లాలోనిజగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలానికి తాసిల్దారుగా వైకుంఠ రావు ని నియమించడం జరిగిందని తెలిపారు. తాసిల్దార్ వైకుంఠ రావు వారి జన్మస్థలం తో పాటు విద్యాభ్యాసం కూడా జగ్గయ్యపేటలోనే కొనసాగించడం జరిగిందనీ. సర్వీస్ రికార్డులలో కూడా ఈ సమాచారం ఉన్నప్పటికీ జిల్లా అధికారి వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వత్సవాయి మండలానికి తాసిల్దారుగా నియమించడం జరిగిందనీ. వారు నందిగామ డివిజన్లోని జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికుడై ఉన్నారని పేర్కొన్నారు. వైకుంఠ రావు నియామకం వలన గ్రామాలలో రెవెన్యూ బ్రోకర్లు పెరిగి గ్రూపు విభేదాలు పెరిగిపోతున్నాయనితెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలు. నిబంధనలు తెలిసి తన స్థానికతను మభ్యపెట్టి వత్సవాయి మండల తాసిల్దార్ గా ఉత్తర్వులు పొందటం ప్రభుత్వాన్ని మోసగించడమేనని చింత శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వారి ఉత్తర్వులపై విచారణ జరిపించి వెంటనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొవాలని శ్రీనివాసరావు పత్రికా ముఖంగా కోరారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img