Monday, January 30, 2023
Monday, January 30, 2023

నూజివీడులో టిడిపి గెలుపే మన లక్ష్యం…

పర్వతనేని గంగాధర్…
విశాలాంధ్ర-చాట్రాయి : నూజివీడులో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఎన్టీఆర్ కు నిజమైన ఘనమైన నివాళి అని నియోజకవర్గ నాయకులు పర్వతనేని గంగాధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన చాట్రాయి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షులు మరిడి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆశయసాధనకై మనమంతా పనిచేయడం అంటే నూజివీడు ఎమ్మెల్యే సీటును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడమే అన్నారు. అది ఒక్కటే ఏకైక లక్ష్యంగా మనమంతా పనిచేయాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని విపిసింగ్ సహకారంతో బలహీన వర్గాలకు స్థానిక సంస్థలలో 27 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని గుర్తు చేశారు. మాజీ ఎంపిపి కందుల కృష్ణ మాట్లాడుతూ,నేను ఎంపీపీ గా పని చేసిన ఈనాడు ఈ సభలో మాట్లాడే అవకాశం దక్కిన అది ఎన్టీఆర్ చలవేనని గుర్తు చేసుకున్నారు. మా బలహీన వర్గాలకు ఎన్టీఆర్ కొండంత అండగా ఉన్నారన్నారు. సభలో అత్తులూరిరమేష్ ఆరుగొలను పేట మాజీ సర్పంచ్ ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, చిత్తపూరు మాజీ సర్పంచ్ కొత్తపల్లి రాందాస్, కొత్తగూడెం మాజీ సర్పంచ్ చల్లగుళ్ళ రాజారత్నం, మర్లపాలెం ఉపసర్పంచ్ వెల్ది రాజా, సీనియర్ నాయకులు వెల్ది నాగేశ్వరరావు, పర్వతాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు, కోటపాడు నాయకులు మంచిన పూర్ణచంద్రరావు, బొంతు సత్యనారాయణ, చాట్రాయి నాయకులు కంచర్ల హనుమంతరావు, గోగుల శ్రీమన్నారాయణ, కొవ్వూరు సత్యనారాయణ, నాగిరెడ్డి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img