Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

పెద్దింట్లమ్మ మహోత్సవాల ప్రారంభం….

విశాలాంధ్ర-కైకలూరు: కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి జాతక మహోత్సవాలను శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. తొలుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పులవర్తి లక్ష్మణ్, ఈవో కందుల వేణుగోపాలరావు, ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరరావు ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ దంపతులను, మాజీ శాసనసభ్యులు జయ మంగళ వెంకటరమణ, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రీ సంతోషి, కైకలూరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలు కురెళ్ళ బేబీలను దుశ్శాలువాలు, పూలమాలలతో స్వాగతించారు. అనంతరం
శ్రీపెద్దింటి అమ్మవారిని దర్శించుకుని అర్చక స్వాముల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వార్షిక జాతర మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండవల్లి మండల జిల్లా పరిషత్ ప్రదేశిక నియోజవర్గ సభ్యురాలు ముంగర విజయనిర్మల, సర్పంచులు జయమంగళ కాసులు, బత్తిన ఉమామహేశ్వరరావు,సైదు వెంకటేశ్వరరావు,ఎంపీటీసీ సభ్యులు బలే నరేష్ ,ఘంటసాల నాగమణి,దేవస్థాన పాలక మండల సభ్యులు మద్దాల సుబ్బలక్ష్మి, ఉడిముడి సుబ్బరాజు,భలే సుజాత, కలిదిండి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ వైవివిఎల్ నాయుడు, ఎంపీడీవో రామలింగేశ్వర రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img