Friday, June 2, 2023
Friday, June 2, 2023

ఫైర్ స్టేషన్ ను ముట్టడించిన తెదేపా నేతలు…

పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్….

విశాలాంధ్ర రూరల్-నందిగామ : చందాపురం పట్టణ సబ్ స్టేషన్ వద్ద పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో సామాన్యుడిని దగా చేస్తున్న ప్రభుత్వం నశించాలని స్థానిక తెదేపా నాయకులతో కలిసి సోమవారం ఉదయం సబ్‌స్టేషన్ల ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలను 7 సార్లు పెంచడమే కాకుండా ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో అదనపు బిల్లులు సామాన్యుడిపై వేయటం దారుణంఅని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, తెదేపా ప్రభుత్వంలో 5 సం ఒకసారి కూడా కరెంటు చార్జీలు కానీ ట్రూ చార్జీలు పెంచలేదని గోడలకు వాల్ పోస్టర్ కు మాత్రమే పరిమితమైనది ఈ ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేసింది ఏమీ లేదని మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కూడా వెనక్కి తీసుకోవాలని మరో మరో వైకాపా అధికారంలోకి వస్తే పెట్టే బేడా సదురుకొని తెలంగాణకు వలస వెళ్లి జీవించాల్సి వస్తుందని వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img