విశాలాంధ్ర రూరల్-నందిగామ : దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు 23 సంవత్సరాల యవ్వన వయస్సులో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ జీవితం యువతకు ఆదర్శం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి మన్నే హనుమంతురావు(అంజి)అన్నారు. శనివారం అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ అధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్థంతి సందర్భంగా జరుగుతున్న అమర వీరుల స్ఫూర్తి వారోత్సవాలు లో భాగంగా నందిగామ లోని పలు పాఠశాలల్లో భారత దేశ స్వాతంత్రం – భగత్ సింగ్ జీవిత చరిత్ర అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బ్రిటీషు పరాయి పాలకుల భానిస చెర నుంచి భారత దేశ విముక్తి కోసం జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ లాంటి అమర వీరులను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నియోజక వర్గం వర్కింగ్ ప్రసిడెంట్ షేక్ మౌలాలి, నాగరాజు, ఉప్పుటూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.