Friday, March 31, 2023
Friday, March 31, 2023

మహా ధర్నాలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనండి

జగ్గయ్యపేట: టిడ్కోఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని, జగనన్న కాలనీల్లో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సి పిఐ) ఆధ్వర్యంలో మార్చి 2 న విజయవాడ లో నిర్వహించ నున్న మహా ధర్నాలో
టిడ్కో మరియు జగనన్న ఇళ్ల లబ్ధిదారు లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్ టీ ఆర్ జిల్లా సి పి ఐ సహాయ కార్యదర్శి దోనె పూడి శంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక డిపో సెంటర్ లో వున్న పార్టీ కార్యాలయంలో మహా ధర్నా కు సంబంధించిన వాల్ పోస్టర్ ను స్థానిక పార్టీ నాయకు లతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణం లో మొత్తం 3250 మందికి పైగా టిడ్కోఇళ్ల లబ్ధిదారులు వున్నారని వారికి లాటరీ ద్వారా ఇళ్లను మంజూరు చేసి 5 సంవత్సరాల కాలం గడిచి నప్పటి కీ వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించ కుండా నాయకులు, అధికారులు తాత్సారం చేయడం అన్యాయమని అన్నారు. వై సి పి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పేద ప్రజల కు 30 లక్షల ఇళ్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకుం తుందని, వాటి నిర్మాణం, స్థితి గతు లని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏ మాత్రం నివాస యోగ్య0 కాని ప్రాంతాల్లో కేవలం సె0టు స్థలాన్ని కేటాయించి చేతులు దులుపుకున్నారని, వాటిలో ఇళ్లు నిర్మించు కోలేక లబ్ధిదారులు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే టిడ్కో ఇళ్లకు మరియు జగనన్న కాలనీ లలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జగ్గయ్యపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి అం బో జి శివాజి, పట్టణ కార్యదర్శి జూ నె బోయి న శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మా శెట్టి రమేష్ బాబు, ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి పో తు పాక వెంకటేశ్వర్లు,ఎన్టీఆర్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు లంక గోవిందరాజులు, పెయ్యాల పృద్వి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img