విశాలాంధ్ర – రూరల్ -నందిగామ : నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన లాల్ కామ్రేడ్ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు (శాస్త్రులు) గారి ఆకాల మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని సిపిఐ నందిగామ నియోజకవర్గ సెక్రటరీ చుండూరు సుబ్బారావు అన్నారు,అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆదివారం రాత్రి అకాల మరణం చెందిన లాల్ కామ్రేడ్ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు (శాస్త్రులు) పార్థివ దేహాన్ని స్థానిక నాయకులతో కలిసి పార్టీ జండా కప్పి సోమవారం ఉదయం ఘన నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాల్ కామ్రేడ్ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు (శాస్త్రులు) పార్టీకి చేసిన సేవా కార్యక్రమాలు గురించి గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మన్నెం నారాయణరావు, మండల కార్యదర్శి మన్నె హనుమంతరావు,పట్టణ కార్యదర్శి వేముల వీరయ్య, ఏఐవైఎఫ్ నాయకులు షేక్ మౌలాలి,మాధవ,సిపిఐ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు