Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం- మంత్రి జోగి రమేష్‌

క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది- ఎం పీ వల్లభనేని
విశాలాంధ్ర – గూడూరు : విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి. రమేష్‌, బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని.బాల శౌరితో కలిసి గూడూరు మండలం, మల్లవోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌ జీ ఎఫ్‌ ఐ) ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి టెన్నికాయిట్‌ అండర్‌ 14, అండర్‌ 17 బాలబాలికల జిల్లా జట్ట ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ విధమైన ఆటల పోటీలు గొప్ప అవకాశం అన్నారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలుఎంతో అవసరమని, తద్వారా చిన్ననాటి నుంచే శరీర వ్యాయామం ద్వారా వికాసంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాల ద్వారా చదువుకు ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నారని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను మంత్రి కోరారు .జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని .బాలశౌరి మాట్లాడుతూ క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని,సరైన వ్యాయామం లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. చదువులో రాణించడానికి విద్యార్థులకు ఏ విధమైన శిక్షణను ఇస్తారో క్రీడల్లో సైతం రాణించటానికి క్రీడా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంపీ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి విద్యార్థుల చదువులకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థులకు శాశ్వతమైన ఆస్తిగా విద్యను ప్రసాధిస్తున్నారన్నారు. పాఠశాల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి అవసరమైన నిధులు మంజూరుకు సహాయం చేస్తానని పాఠశాల విద్యార్థులకు ఎంపీ హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి ,ఎంపీలు ఇరువురు క్రీడలను ప్రారంభించారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి టెన్నీకాయిట్‌ ఆడి విద్యార్థులలో ఉత్సాహం నింపారు.
ఈ కార్యక్రమంలో గూడూరు మండల జడ్‌ పీ టి సి వేమూరి సురేష్‌ రంగబాబు, గూడూరు ఎం పీ పీ సంఘ. మధుసూదన్‌ రావు, బంటుమిల్లి ఎం పీ పీ వెలివెల. చిన బాబు ,మండల వైసీపీ అధ్యక్షులు తలుపుల. వెంకట కృష్ణారావు, రాష్ట్ర ఎస్‌ ఎఫ్‌ సి డైరెక్టర్‌ కారుమంచి .కామేశ్వరరావు, వైసీపీ మండల కన్వీనర్‌ ఎం .రాజ బాబు, పెడన మూడో వార్డు కౌన్సిలర్‌ బళ్ల. గంగయ్య విద్యా కమిటీ చైర్మన్‌ నరసింహ రావు, ప్రధానోపాధ్యాయులు పాండురంగారావు, గ్రామ సర్పంచ్‌ బి. సాంబశివయ్య ,ఆర్‌ బి కె చైర్మన్‌ మహా లక్ష్మయ్య నాయుడు ,ఎంపీటీసీ పిట్ల .రామిరెడ్డి గోరిపర్కి. రవి, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img