Monday, February 6, 2023
Monday, February 6, 2023

వివాహిత ఆత్మహత్య

విశాలాంధ్ర-వత్సవాయి : ఉరి వేసుకుని బలవన్‌ మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని సింగవరం గ్రామంలో చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన సాయి భార్గవికి(32) సింగవరం గ్రామానికి చెందిన సింధు నరసింహారావు తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు… గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు వివాహమైన మొదటి నుండి వీరి కాపురంలో తరచూ గొడవలు అవుతూ సాయి భార్గవి తన పుట్టింటికి వెళుతూ ఉండేది. పలుమార్లు తన భర్త అయినా నరసింహారావును కుటుంబ సభ్యులు మద్యాన్ని మానేయమని పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన వైఖరిని మార్చుకోలేదు.. చేసేదేమీ లేక సాయి భార్గవి సర్దుకుపోయేది బుధవారం నాడు వారి పిల్లలు ఇద్దరు పాఠశాలకు వెళ్లిన తర్వాత మద్యం మత్తులో ఉన్న తన భర్త భార్యతో వాగ్వివాదానికి దిగడంతో మనస్థాపానికి లోనై ఇంటిలోని ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని చనిపోయిందని గ్రామస్తులు అంటున్నారు… సాయి భార్గవి చనిపోయిన సమయంలో తన భర్త కూడా ఇంట్లో ఉండడం వల్ల పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి.. తన భర్త వల్లే సాయి భార్గవి చనిపోయిందని భార్య కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్సై అభిమన్యు తెలిపారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img