Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

వైకాపా సర్పంచ్‌ ఆత్మహత్య

విశాలాంధ్ర-వత్సవాయి : ప్రజా ప్రతినిధిగా గృహిణిగా ఉన్న మహిళ బలవన్‌ మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని పెద్ద మోదుగు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది సేకరించిన సమాచారం మేరకు కళ్యాణపు తేజస్విని(34) పెద్ద మోదుగు పల్లి గ్రామంలో వైకాపా సర్పంచ్‌ గా విధులు నిర్వహిస్తుండగా… ఇటీవల కాలంలో కుటుంబంలో జరిగిన కలహాల నేపథ్యంలో ఇంటిలోని ఫ్యాన్‌ కు ఉరివేసుకొని బలవన్‌ మరణానికి పాల్పడి ఉంటుందనిగ్రామస్తులు తెలుపుతున్నారు.. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై అభిమన్యు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img