Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సామాజిక విప్లవోద్యమ పితామహుడు జ్యోతిరావు పూలే..

విశాలాంధ్ర`వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయి లోని గురుకుల పాఠశాలలో జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ కె విజయలక్ష్మి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ మన దేశంలో బడుగు బలహీన వర్గాలు కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే అందుకే కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఒక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.బడుగులు బానిసలుగా ఉండడానికి దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడానికి, చదువు లేకపోవడమే మూలమని గ్రహించారు. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో పురోహితులు లేకుండా జూన్నార్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు అని,కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్‌ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల ను ఎదిరించారని అంతేకాకుండా , తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్‌ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్‌.ఎమ్‌.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్‌ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img