Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

స్పందనలో అర్జీలను స్వీకరించిన ఆర్డీవో

గుడివాడ : ఇప్పటి వరకు ఈకేవైసీ లో పేర్లు నమోదు లేని రేషన్‌ కార్డు దారులు ఈ నెల 25 లోపు నమోదు చేయించుకోవాలని లేకుండా సెప్టెంబరు మాసం నుంచి సరఫరా చేసే నిత్యావసర సరుకులు నిలుపు దల చేయడం జరుగుతుందని ఆర్డీవో శ్రీనుకుమార్‌ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్‌ డివిజన్‌ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలో ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కొరకు స్పందనలో ధరఖాస్తు చేసిన అర్జీదారుల సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరు స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో ఏ ఒక్క అర్జీ పెండిరగ్‌ లో లేకుండా పరిష్కరించాలన్నారు.
ఇప్పటి వరకు ఈకేవైసీలో రేషన్‌ కార్డులో ఉన్న వారి పేర్లు నమోదు కాకుంటే సంబందిత వీఆర్వో, తాహశీల్థార్లు, సచివాలయాల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈకేవైసీలో పేరు నమోదు కాకుంటే రేషన్‌ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు నిలుపదల చేస్తుందన్నారు. గుడివాడ పట్టణంతో పాటు డివిజన్‌ పరిధిలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. వినియోగదారునితో పాటు దుకాణ యజమానులు తప్పనిసరిగా మాస్కులు ధరంచాలన్నారు. ఇందుకు విరుద్దంగా ఏవరైనా కోవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తే అటువంటి దుకాణ దారులపై చర్యలు తీసుకుంటామన్నారు. థర్డ్‌ వేవ్‌లో చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img