Friday, April 19, 2024
Friday, April 19, 2024

అప్రకటిత కరెంటు కోతలు,అడ్డగోలు బిల్లుల మోతలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్….

విశాలాంధ్ర -నందిగామ రూరల్..: అప్రకటిత కరెంట్ కోతులు, అడ్డగోలు బిల్లుల మోతలు ఆపాలని స్థానిక నాయకులతో కలిసి మండల పరిధిలోని చందాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం.విద్యుత్ కోతలు విధిస్తున్నారని 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న క్రమంలో ఉక్కపోతకు నియోజకవర్గ ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారని గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచడం గాని విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చామని,చిత్తశుద్ధి లేని దౌర్భాగ్యపు ప్రభుత్వనికి భారీగా విద్యుత్ బకాయిలు ఉన్నాయని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img