Friday, April 19, 2024
Friday, April 19, 2024

కన్నివీడు ఇసుక క్వారీ సిబ్బంది చేతి వాటం


విశాలాంధ్ర- వత్సవాయి: మండలంలోని కన్ని వీడు ఇసుక క్వారీలో ఇసుక క్వారీ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు…… ఇసుక ఏజెన్సీ పుణ్యమా అని సామాన్యునికి ఇసుక అందని ద్రాక్షలా మారింది… టన్ను ఇసుక475 రూపాయలు ఉండగా ఒక ట్రాక్టర్ కు 2375 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు… క్వారీ సిబ్బంది ట్రాక్టర్ వారితో మమేకమై కాటా వేయించకుండానే తమ ఇష్టానుసారంగా ఓవర్ లోడ్ వేస్తూ ఎంతో కొంత తమ జేబులునింపుకుంటున్నారు.. అదేవిధంగా ఉదయం పూట ఒక ట్రాక్టర్ వచ్చినట్లయితే వారితో ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకొని ఒకటే కూపన్ పై సుమారు రెండు నుంచి మూడు ట్రిప్పులు ఇసుక అక్రమ రవాణా చేసుకుంటున్నారని తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పలువురు అంటున్నారు…..
జగనన్న గృహాలకు కూపన్ విధానం ద్వారా గ్రామాలలో కూపన్లు ఇస్తూ ఉండగా కన్ని వీడు క్వారీలు మాత్రం ఎటువంటి కూపన్లకు ఇసుక ఇవ్వమని తేల్చి చెబుతూ ఉండడంతో గృహ లబ్ధిదారులు చేసేదేమీ లేక ఉచిత ఇసుకను వదులుకొని తమ జేబులోని డబ్బులతో తోలించుకుంటున్నారు …. తెలంగాణ లారీలకు యదేచ్చగా ఇసుక లోడ్ చేయడం వల్ల సిబ్బందిపైపలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2021లో క్వారీ సిబ్బంది. కన్ని వీడు క్వారీలో సిబ్బంది చేసిన అవకతవకలు ఇసుక అక్రమ రవాణా మండల ప్రజలకు తెలియనిది కాదు ఇప్పటికైనా సంబంధించిన శాఖ అధికారులు వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసినట్లయితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఉంటుందని మండల ప్రజలు కోరుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img