Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాంట్రాక్ట్‌ కార్మికులకు పెండిరగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

ఎఐటీయుసీ ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహరావు

కంచికచర్ల : గత మూడు నెలల నుంచి జీతాలు లేక ఆర్ధకాలితో ఆలమటిస్తున్నా కాట్రాక్టర్‌ గాని, అధికారులు గాని మా సమస్యలను పట్టించుకోవటంలేదని వాపోతూ, నందిగామ సబ్‌ డివిజన్‌ పరిధిలోని బత్తినపాడు, కంచికచర్ల సీపీడబ్య్లూఎస్‌ రక్షిత మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఆర్‌డబ్య్లూఏపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా ది. కృష్ణాడిస్ట్రిక్‌ పంచాయితీ రాజ్‌ ఆర్‌డబ్య్లూఏస్‌, సీపీడబ్య్లూఎస్‌ మెయిట్‌నెస్‌ వర్కుర్సు యూనియన్‌ (ఎఐటీయుసీ) ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహరావు మాట్లాడుతూ, తాము గత 20 సంవత్సరాలకు పైనుంచి కాట్రాక్టు కార్మికులుగా రక్షిత మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నామన్నారు. వారికి గత మూడు నెలల నుంచి జీతాలు లేక ఆర్ధకాలితో పనిచేయుచున్నామన్నారు. సంబంధింత కాట్రాక్టర్‌ని ఎన్ని పర్యాయములు వేతనాల విషయమై అడిగిన సరjైున సమాధానం చెప్పకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత 15 రోజుల క్రితం తమ సమస్యలపై స్థానిక ఏఈఈని మరియు డీఈఈ దృష్టికి తీసుకెళ్ళామని అయినకూడా సరjైున సమాధానం లేకపోవటంతో మాకుటంబాల ఆర్ధిక పరిస్థితుల వల్ల విధులను కూడా సక్రమంగా చేయలేకపోతున్నామన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించామన్నారు. మూడు నెలలు దాడి నాల్గువ నెల గడుస్తున్న ఇంతవరకు వేతనాలు అందించకుండా కాట్రాక్టు కార్మికులను మానసిక వేధనకు గురి చేస్తున్నారని వాపోయారు. గత్యంతరం లేని స్థితిలో నరసన కార్యక్రమం చేపట్టాటం జరిగిందని అన్నారు. ఇప్పటికైన సంబంధింత అధికారులు, కాంట్రాక్టుర్ల సంబంధించి మా జీవన పరిస్థితులను ఆర్దం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో కార్మికులు జి.సుబ్బారావు, శేషం ప్రసాద్‌, సీహెచ్‌ థామాస్‌, పి.దాసు, ఎస్‌.తిలాక్‌, పి.జీవన్‌ కుమార్‌, కె.యల్లమందరావు, పి.నాని, పి.వెంకయ్య, టి.రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img