Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కౌటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

అవనిగడ్డ :` ఎజెంట్లకు సూపర్‌వైజర్లకు యంపిటిసి, జెడ్‌పిటిసి సంబందించి జాయింట్‌ కలెక్టర్‌ కె మోహన్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాలైన అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాలకు సంబందించి ఎన్నికల కౌటింగ్‌ అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అవరణలో ఏ మండలానికి ఆ మండలం విడివిడిగా కౌటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా సంయుక్త కార్యదర్శి మోహాన్‌కుమార్‌ అన్నారు. మిగిలిన 2 మండలాలైన ఘంటసాల, చల్లపల్లి మండలాలతో పాటు పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం ఘంటసాలలో కౌటింగ్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. శనివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించి విలేకర్లతో మాట్లాడుతూ ఒక్కోక్క మండలానికి 12 టెబుల్స్‌ 12 మంది సూపర్‌వైజర్లు, ముగ్గురు పోలింగ్‌ సిబ్బంది ఉంటారని కౌంటింగ్‌ రోజు ఉదయం ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లేక్కించిన అనంతరం 25 చప్పున కట్టలు కట్టడం జరుగుతుందని యంపిటిసి, జడ్‌పిటిసి లెక్కింపు ఒకేసారి జరుగుతుందన్నారు. గతంలో యంపిటిసి లెక్కింపు అయిన అనంతరం జడ్‌పిటిసి లెక్కింపు జరిగేదని ఈ పర్యాయం కొద్దిపాటి మార్పు జరిగిందన్నారు. అభ్యర్ధులు ఎజెంట్లు కోవిడ్‌ నిబంధనలకు అనుగునంగా నడుచుకోవాలని వ్యాక్సినేషన్లు వేయించుకొన్నట్లుగా అనుమతి పత్రాలతో కౌటింగ్‌ కేంద్రాలకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ యస్‌ సముద్రయ్య, యంపిడిఓ బియం లక్ష్మీకుమారి, తహాశీల్ధార్‌ శ్రీనునాయక్‌లతో పాటు పలువురు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img