Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడ్కో ఇళ్ల విషయంలో లబ్ధిదారులను మభ్య పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన టిడ్కో గృహాలు
9న జగ్గయ్య పేటలో టిడ్కో ఇళ్ళ సాధన కోరుతూ నిరసన ప్రదర్శన
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దొనేపూడి శంకర్‌

విశాలాంధ్ర`జగ్గయ్య పేట : టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలని భారత కమ్యూనిస్ట్‌ పార్టీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపుడి శంకర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక జగ్గయ్య పేట లోని టి ఇళ్లను శుక్రవారం సీపీఐ దోనేపూడి శంకర్‌ బృందం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్‌ గారు మాట్లాడుతూ, టిడ్కో ఇళ్ళ విషయంలో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, జగ్గయ్యపేట లో సుమారుగా 3245 టిడ్కో గృహాలు 80 శాతం నిర్మాణం పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా, విష సర్పాలకు కేంద్రంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు నివాసయోగ్యంగా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కనీస సదుపాయాలైన కరెంటు మంచినీరు డ్రైనేజీ రోడ్లను నిర్మించడంలో అలసత్వం వహించడం దారుణమని అన్నారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పజెప్పకుండా ప్రభుత్వం పాలకులు దోబూచులాడడం సరికాదని విమర్శించారు. డిసెంబర్‌ 9న జగ్గయ్యపేటలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఈ టీడ్కో ఇళ్ల లబ్ధిదారులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లంకా గోవిందరాజులు, పేయ్యల పృథ్వి, సిపిఐ పట్టణ కార్యదర్శి జూనె బోయిన శ్రీనివాసరావు, నియోజకవర్గ పార్టీ సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ, నాయకులు పోతిపాక వెంకటేశ్వర్లు, మాశెట్టి రమేష్‌,మహమ్మద్‌ అసదుల్లా, భోగ్య0 నాగులు, మేటికల శ్రీను,జానీ, భాను, నాని, రాణి,రామారావు, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img