Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

నందవరంలో ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
విశాలాంధ్ర`నందవరం :
సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నందవరంలో సిపిఐ ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జెండాను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్‌ ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్‌, సీపీఐ జిల్లా సభ్యులు సోమేశ్వర రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గిడ్డయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి విజేంద్ర మాట్లాడుతూ .భారత కమ్యూనిస్టు పార్టీ మరో మూడు సంవత్సరాలలో పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతున్నామని తెలిపారు. భారత దేశ స్వతంత్ర ఉద్యమంలో అగ్ర బాగానే ఉండి పోరాటం చేసిన పార్టీ సీపీఐ అని తెలిపారు.దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు సాగించి భారతదేశంలోని ప్రధాన పోరాట పాత్ర కమ్యూనిస్టు పార్టీదని కొనియాడారు. దేశంలో వెట్టి చాకిరికి దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ నాయకత్వమే పోరాడిరదన్నారు,,దేశంలో శ్రామికులను సమీకరించి యూనియన్లు ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం ఎనిమిది గంటల పని దినం కోసం వేతనాల కోసం న్యాయబద్ధమైన సామాజిక భద్రత కోసం పోరాడిరదన్నారు.ఉద్యోగ భద్రత విద్యార్థి యువజన సంఘాలు ఏర్పాటు చేసి ఉద్యమాలు క్రియాశీలకంగా నడిపిందన్నారు,రైతు సంఘాల ద్వారా దున్నేవాడికి భూమికోసం నాణ్యమైన ధరల కోసం పోరాటం చేపట్టిందన్నారు. మహిళా సంఘాల ద్వారా వారిలో చైతన్యం పెంపొందించి వారి హక్కుల కోసం సమాన వేతనాల కోసం అనేక సమస్యల పైన దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం ద్వారానే ముఖ్యమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది అన్నారు.. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఒకవైపు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల పైన విపరీతంగా భారం మోపుతూ నిత్యవసర సరుకులు,పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలు విపరీతంగా పెంచారన్నారు. రాష్ట్రంలో ప్రజల పైన దాడులు చేస్తూ ప్రజలను భయంతోలను గురి చేస్తూ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జగన్మోహన్‌ రెడ్డి కొనసాగిస్తున్నారన్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు విజయ్‌ కుమార్‌, నాగరాజు, శంతన్న, భేమన్న, జలాలు,మునిస్వామి, ఈరన్న, ఓంకార, అంజినేయలు, నల్లన్న,వేరేష్‌,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img