Friday, April 19, 2024
Friday, April 19, 2024

నల ్లతామరపురుగు వల్ల దెబ్బ తిన్న మిర్చి పంటకు ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలి

– ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం డిమాండ్‌
విశాలాంద్ర` నందిగామ :
తామర పురుగు వలన దెబ్బతిన్న మిర్చి పంటకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని,బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను అన్నిటి రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది. తామర పురుగు వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య అన్నారు శుక్రవారం నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో మిర్చి తోటలను జిల్లా కార్యదర్శి మల్నీడు ఎల్లమందరావు, నందిగామ నియోజకవర్గ కన్వీనర్‌ చుండూరు సుబ్బారావు లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరానికి కౌలుతోపాటు ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల పైగా పెట్టుబడి పెట్టి తామరపురుగు వలన రైతులు దెబ్బతిన్నారని, గత సంవత్సరం తామర పురుగు వల్లనే లక్షలాది ఎకరాలు పంటలు ధ్వంసమై ఆర్థికంగా నష్టపోయారని,అయినా ప్రభుత్వం ఈ సంవత్సరం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతాంగం నష్టపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని కోరారు.ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, జిల్లా కార్యదర్శి మల్నీడు యల్లమందారావు, నందిగామ నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి చుండూరి సుబ్బారావు,అంగడాల శ్రీనివాసరావు, పల్లి కంటి దాసు, పాలేటి రామకృష్ణ, దర్శినాల నాగమల్లేశ్వరావు, ఏఐటిసి నాయకులు వేములవీరయ్య తదితరులు బృందంగా ఏర్పడి ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ మండలం రామిరెడ్డిపల్లి,జొన్నలగడ్డ, పల్లగిరి,మాగల్లు తదితర గ్రామాల్లో మిర్చి పంటలను పరిశీలించింది. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించింది రాష్ట్ర ప్రభుత్వం తామర పురుగు వల్ల నష్టపోయిన పంటలను కూడా ఇప్పటివరకు పరిశీలించకపోవడం బాధాకరమైన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంటల పరిశీలించడానికి శాస్త్రవేత్తల బృందాలను పంపించి పంటలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు మిర్చి తోటలు వేసిన రైతంగంలో 90 శాతం మంది కౌలు రైతులేనని, వాస్తవ సాగుదారులైన కౌలురైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img