Friday, April 19, 2024
Friday, April 19, 2024

బాల బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి ..జడ్జ్‌ షేక్‌ షిరీన్‌ సందేశం

విశాలాంధ్ర – మైలవరం: భారత సుప్రీంకోర్టు జాతీయ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ పిలుపుమేరకు మైలవరం మండలం న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మైలవరం ఎస్‌ ఎస్‌ కె ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ నందు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా సంస్థ చైర్మన్‌ మైలవరం జూనియర్‌ జడ్జి షేక్‌ షిరీన్‌ హాజరై బాల బాలికను ఉద్దేశించి ప్రసంగిస్తూ బాల బాలికలు చదువుతోపాటు చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సందేశం ఇచ్చారు,

ఈ సదస్సుకు మైలవరం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు బుద్ధవరపు వెంకటరావు అధ్యక్షత వహించగా వేదికపై బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు గుణగంటి శ్రీనివాస్‌ రావు , ఎస్‌ ఎస్‌ కే విద్యాసంస్థల అధినేత గొల్లపూడి మోహన్‌ రావు, స్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయులు బాబూజీ జూనియర్‌ న్యాయవాది ఎం తనూజ్‌ లు వేదికపై ఆసీనులయ్యారు ,

 జడ్జ్‌ షిరీన్‌ ప్రసంగిస్తూ న్యాయ సేవా అధికార సంస్థ దాని లక్ష్యాలు పని  విధానాలు సేవలు,  లోక్‌ అదాలత్‌ కేసులు  రాజి చేయటం ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ప్రభుత్వం  ఫీజులు లేకుండా నిర్బంధ విద్యా విధానం అమలు చేస్తుందని దానిని ఉపయోగించుకోవాలని చైల్డ్‌ లేబర్‌ బాల్యవివాహాలు , ఫోక్సో కేసులు  తదితర విషయాలపై వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img