Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మైలవరం నియోజకవర్గంలో 1625 నూతన పింఛన్లు మంజూరు.

రూ.2,750లు పెంచిన పింఛన్‌ సొమ్ము అందజేత
ఇచ్చినమాట ప్రకారం ప్రతి ఏడాది పింఛన్‌ సొమ్ము పెంపుదల
పింఛన్లు తొలగిస్తున్నట్లు అసత్యప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు
ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీలో ఇప్పటివరకు రూ.179 కోట్లు సంక్షేమ పథకాలకు చెల్లింపు.
అభివృద్ధి పనులకు సుమారు రూ.50 కోట్లు మంజూరు.
ఇంటింటికీ కుళాయికి తాజాగా రూ.55 కోట్లు
గౌరవ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు

విశాలాంధ్ర – మైలవరం : నియోజకవర్గంలో 1652 మంది లబ్దిదారులకు నూతనంగా పింఛన్లు మంజూరైనట్లు గౌరవ మైలవరం శాసనసభ్యలు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడిరచారు.ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయంలో వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద మంజూరు అయిన పింఛన్‌ సొమ్మును, రైస్‌ కార్డులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ పేద ప్రజల తరపున సీఎం శ్రీ జగన్మోహన్‌ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపి పెంచిన పింఛన్‌ సొమ్ముతో పేద కుటుంబాలకు ఆర్ధిక భరోసా కలుగుతుందన్నారు, పింఛన్‌ కోసం క్యూలు కట్టి ఎదురుచూపులు చూసే విధానానికి స్వస్తి పలికి తెల్లవారుజాము నుంచి వాలంటీర్లతో నేరుగా పింఛన్‌ సొమ్మును ఇళ్లకే వెళ్లి అందజేస్తున్న ఘనత మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారికే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా మార్పును గమనించాలన్నారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 20వేల మందికి ఇళ్ళపట్టాలు ఇచ్చామన్నారు, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో
గత ప్రభుత్వంలో దాదాపుగా 500 మందికి మాత్రమే ఇళ్ళపట్టాలు ఇస్తే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3600 మందికి ఇళ్ళపట్టాలు ఇచ్చామన్నారు. అర్హతలు ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదు అనే ప్రధాన లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్‌ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు, గత ప్రభుత్వం గ్రామాల్లో పెత్తందారులను నియమించి వారి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కానీ నేడు సీఎం జగన్మోహన్‌ రెడ్డి, వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు,
పింఛన్లు తీసేస్తున్నారని ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీలో 336 మందికి కొత్తగా మంజూరు చేస్తే ఇక్కడ కేవలం అనర్హులకు 35 మందికి మాత్రమే పింఛన్లు తొలగించినట్లు వెల్లడిరచారు, ఇక్కడ అర్హతలు లేని వారి పింఛన్లు తొలగించిన దానికంటే అర్హతలు ఉన్న వారికి 10 రెట్లు ఎక్కువమంది లబ్దిదారులకు పింఛన్లు అందజేసినట్లు వెల్లడిరచారు, ఇది కూడా ప్రజలు గమనించాలన్నారు. ప్రతిపక్షాలు ఈ మార్పును గమనించవన్నారు. ఎంతసేపటికీ ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై బురదజల్లటమే ప్రధాన ధ్యేయమన్నారు, ఇబ్రహీంపట్నం మండలంలోని పేదలకు ఇప్పటివరకు దాదాపు 179 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల అమలు కోసం చెల్లించినట్లు వెల్లడిరచారు, ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీలో 26,717 మందికి రైస్‌ కార్డులు ఉంటే తాజాగా 181 మందికి రైస్‌ కార్డులను ఇచ్చామన్నారు, ఇదేవిధంగా అభివృద్ధి పనులకు రూ.45 నుంచి రూ.50 కోట్ల వరకు మంజూరు చేశామన్నారు, తాజాగా ఇక్కడ ఇంటింటికీ నీటికుళాయి ఇచ్చేందుకు రూ.55 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడిరచారు, అతి త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు,
ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వమన్నారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకు వేస్తేనేడు మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేసి పేదలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img