Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాజ్యంగ విలువలను కాలరాస్తున్న జగన్‌ : కాగిత కృష్ణప్రసాద్‌

విశాలాంధ్ర-బంటుమిల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి రాష్ట్రంలో రాజ్యంగ విలువలను కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ,పెడన నియోజకవర్గ ఇంచార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు .చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టునకు నిరసనగా గురువారం స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద టిడిపి కార్యకర్తలతో కలసి కాగిత కృష్ణప్రసాద్‌ నిరసన కార్యక్రమాన్ని చేపట్ట్టారు .ఈ సందర్భంగా కాగిత మాట్లడుతూ, భారతీయులు దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషు వారిపై పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి ప్రజలను చిత్రహింసలకు గురిచేసేవారన్నారు.అటువంటి నియంత పరిపాలనను వైసీపీ ప్రభుత్వం రుజువు చేసుకుందన్నారు. వైసీపీి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ,అరాచక శక్తులు చెస్తున్న దాడులను నిలదీస్తున్న ఉత్తరాంధ్ర బిసీి నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వారి కుమారుడు రాజేష్‌లపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి పొలీసులతో ఇంటిపై దాడిచేయించి అరెస్టులు చెయ్యడం బ్రిటిషు వారి పరిపాలనను మించిపోయిందన్నారు.ఇంతటి దౌర్భాగ్య పరిపాలన ప్రపంచ చరిత్రలోనే లేదన్నారు .అనంతరం బి అర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి గాంధీ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ ,పొట్టి శ్రీరాముల విగ్రహాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి బొల్లా వెంకన్న , టీడీపీ సీినియర్‌ నాయకులు ఇల్లురి లీలాకృష్ణ ,పాలడుగు వెంకటేశ్వరరావు ,బొర్ర ఖాసి ,జొన్నలగడ్డ కొండలరావు ,అక్బర్‌,భాజాని ,ప్రవీణ్‌ కుమార్‌ మళ్ళా సూర్యచంద్రరావు ,కట్ట శేషగిరి ,జక్రయ్య ,రాజులపాటి రమేష్‌ ,జోగి గౌరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img