Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

15వ ఆర్ధిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టండి

గుడివాడ : 15వ ఆర్ధిక సంఘం నిధులతో గుడివాడ మున్సిపాలిటీలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) మున్సిపల్‌ కమిషనర్‌ పీజే సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ నిధులతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. పట్టణంలోని ఏడు వార్డులకు సంబంధించిన వార్డు సచివాలయాలు మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటన్నింటిని హైకోర్టు ఆదేశాల మేరకు ఆయా వార్డుల్లోని వేరే ప్రాంతాలకు తరలించామన్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వార్డు సచివాలయాలను తాత్కాలికంగా తరలించి ఆయా వార్డుల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజల ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు, భవనాలు అందుబాటులో లేని వార్డుల్లో అద్దె భవనాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గుడివాడ మున్సిపాలిటీలో 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1.50కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. వీటిని ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వినియోగిచలని మంత్రి కొడాలి నాని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img