Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఓకే కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తల్లి అమీనా…

విశాలాంధ్ర – నందిగామ : ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించిన సంఘటన నందిగామ పట్టణంలో గురువారం పద్మశ్రీ హాస్పటల్లో జరిగింది. వివరాలు నందిగామ పట్టణానికి చెందిన షేక్ అమీనా భర్త సర్ధార్ నిరుపేద కుటుంబం. అమీనా పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రి కి రావటం జరిగింది. ఆమెకు బ్లడ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు సకాలంలో స్పందించి మానవతాదృక్పధంతో డబ్బులు తీసుకోకుండా , ఆమెకు గురువారం ఉదయం సర్జరీ చేశారు. నిమిషాల వ్యవదిలోనే తొలుథ ఇద్దరు మగ శిశువులు. ఒక ఆడ శిశువు జన్మించారు. ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించటంతో ఆకుటంబ సభ్యులు ఆనందబాష్పాలతో కేరింతలు కొట్టారు. పలువురు ప్రముఖులు ఆతల్లిని, కవల పిల్లలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు డా.సురేష్, డా.మనోరమ,డా.భరద్వాజ, డా.వెంకటేష్,నర్సులు పాల్గొని వైద్య సేవలు అందించి ముగ్గరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తిని అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img