Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కార్పొరేట్ కళ

విశాలాంధ్ర- గూడూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు- నేడు పథకంతో విద్యా వ్యవస్థల్లో ఎంతో విప్లాత్మక మార్పు వచ్చిందని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి. రమేష్ అన్నారు. సోమవారం ఆయన బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు- నేడు పథకం రెండవ దశ పనులు కింద రుా. 62 లక్షల 43 వేల 434 రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలు, కళాశాలు నాడు- నేడు ద్వారా కార్పొరేటు కళ వచ్చిందన్నారు . అనంతరం కళాశాల అధ్యాపకులు, స్థానిక ప్రముఖులు ఆధ్వర్యంలో 100 రోజులు మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని లాంచనయంగా ప్రారంభించారు. దుార ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఆహారానికి ఇబ్బంది పడకూడదని సదుద్దేశంతో స్వచ్ఛందంగా అధ్యాపకులు ఈ కార్యక్రమానికి పూనుకోవటం ఎంతో సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్ పర్సన్ కళాశాల పూర్వ విద్యార్థిని బళ్ల. జోత్స్నా రాణి, కౌన్సిలర్లు, బళ్ల. గంగయ్య, తనుాజ, కళాశాల ప్రిన్సిపాల్ సల్మాన్ రాజు, లైబ్రేరియన్ పేరిశెట్టి. నాగ రవి, పలువురు లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img