Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

శ్రీ చైతన్య విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: స్ధానిక శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు నాసా కిట్లను మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ప్రగతి పధం లో నడిపించడమే లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా విలువైన విద్య అందిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఆయన కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులను ఇప్పటినుంచే నాసా లాంటి ప్రయోగాత్మక కార్యక్రమాలకు ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు చైతన్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, వినోద్ కుమార్, ప్రిన్సిపల్ లావణ్య, డీన్ కృష్ణ, నాసా ఇంచార్జ్ నరసింహారావు, కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు,కిషోర్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img