Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

జూదం, అక్రమ ఇసుక, బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన ఎస్సై అభిమన్యు

విశాలాంధ్ర – వత్సవాయి : బదిలీల్లో భాగంగా మండల కేంద్రమైన వత్సవాయికి ఎస్సైగా వచ్చిన అభిమన్యు అక్రమ ఇసుక రవాణా,జూదం మరియు బెల్ట్ షాపులపై ఉక్కు పాదాన్ని మోపుతున్నారు….భీమవరం గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వారిని చాకచక్యంగా సమాచారాన్ని సేకరించి వారిని అదుపులోనికి తీసు కున్నారు..మరియు మండలంలోని లింగాల గ్రామంలో వెంకట్రామయ్య టీ దుకాణంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకొని 29 ఓల్డ్ అడ్మిరల్ 180 ఎంఎల్ బాటిల్స్ సీజ్ చేసి వారిపై సంబంధిత చర్యలు తీసుకున్నారు . ఇటీవల కాలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని స్థానిక స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు…… సాధారణంగా బదిలీపై వచ్చిన అధికారి మండలంలో అన్ని గ్రామాల్లో పట్టు సాధించి సమాచారాన్ని సేకరించాలంటే కొంత సమయం పడుతుంది….. వచ్చిన నాటినుండి అక్రమ ఇసుక రవాణా జూదం బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపి మండలంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతూ ఎస్సై అభిమన్యు అందరి మన్ననలు పొందుతున్నారని మండల ప్రజలు అంటున్నారు….. ఠానాకు వచ్చిన వారిపట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ జాప్యం చేయకుండా పరిష్కారం చూపుతూ ఉండటంతో పోలీసు కు నిజమైన అర్థం చెప్పే విధంగా అభిమన్యు ఉన్నారని ప్రశంసించడంలో అతిశక్తి లేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img