విశాలాంధ్రవిజయవాడ (వన్‌టౌన్): ఫ్లోరెన్స్ నైటెంగిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ క్యాపింగ్ అండ్ ల్యాంప్ లైటింగ్ వేడుకలు శుక్రవారం పటమటలోని నల్లూరివారి కళ్యాణమండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన లతా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ డాక్టర్ పి. సుశీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు ఈ నర్సింగ్ కోర్సు ఎంచుకోవటం ఎంతో ఉత్తమమైనదని, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నవారిపట్ల వీరు చూపించే ఆప్యాయతవల్ల వారు ఎంతో సంతోషంగా ఇళ్ళకు వెళుతున్నారని చెప్పారు. ఈ నర్సింగ్ కోచింగ్ పంపించిన విద్యార్ధుల తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సింగ్ కోచింగ్‌తో మాత్రమే ఆగిపోకుండా ఇంకా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా వైస్ ప్రిన్సిపల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆర్.బి.వై.ఎస్. నిర్మలాబై, గ్రేడ్
1 నర్సింగ్ సూపరిండెంట్ అక్కమ్మ, గ్రేడ్ `2 నర్సింగ్ సూపరిండెంట్ ఎం. విజయలక్ష్మి, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైస్ ప్రిన్సిపల్ పి. విజయ, హెబ్రోన్ సీనియర్ పాస్టర్ బ్రదర్ జోబు, ఎన్. డైజిరాణి, సెక్రెటరీ కరస్పాండెంట్ స్వదీప, చైర్మన్ ప్రుధ్వీ తదితరులు పాల్గొన్నారు.










