విజయవాడ : ఇండియన్ స్వచ్ఛభారత్ లీగ్ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇళ్ళలో దోమల వ్యాపి చెందకుండా, లార్వా పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఇంటిలో పూల కుండిలాలలో మొక్కలను పెంచుతామని మనకు తెలియకుండానే ఆ కుండిల్లో నిల్వ వుండే నీటిలోకూడా లార్వా తయారయ్యే అవకాశాలు వున్నాయని వాటిని కూడా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని, మన చుట్టు పక్కల వుండే పరిశరాలను శుబ్రంగా వుంచుకోవాలని, చిన్న చిన్న గుంటలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఉపయోగంలోలేని నీరు నిల్వ పట్ల ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత దోమల వ్యాప్తి నిర్మూలించగలుగుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎం.ఒ. `4, డా॥ శ్రీదేవి, 32వ వార్డు సచివాలయం అడ్మిన్ రహీమ్, శానిటరి ఇన్పెక్టర్ వై.ఎన్. కమలాకర్‌లు పాల్గొన్నారు.

