Friday, December 2, 2022
Friday, December 2, 2022

జగన్ అన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

విశాలాంధ్ర-మైలవరం: మైలవరంలోని స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీరాష్ట్ర అధికారప్రతినిధి మరియు మైలవరం ఇంచార్జి అక్కల రామ్మోహన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు #Jagananna Mosam, జగన్ అన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు* కార్యక్రమంలో భాగంగా,పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో 12,13,14 వ తేదీలలో జగనన్న కాలనీలలో పర్యటించడం జరుగుతుందన్నారు, మౌలిక సదుపాయాల గురించి ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని మా అధినేతకు నివేదిక ఇస్తామన్నారు , పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని వెల్లడించారు, ఈ మీడియా సమావేశంలో జనసేనపార్టీ మైలవరం,ఇబ్రహీంపట్నం,రెడ్డిగూడెం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, పోలిశెట్టి తేజ,చాపలమడుగు కాంతారావు,ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్,నాయకులు భూక్య చిరంజీవి, మాదాస్ సుబ్బారావు,బత్తిన శ్రీనివాసరావు,తోట క్రాంతి బాబు,పౌల్ రాజ్,మాదినేని చిన్న రామారావు,పసుపులేటి నాగరాజు,జనసైనికులు పాండు,మర్రి కొండలరావు,యతిరాజు ప్రవీణ్,శీలం బాలకృష్ణ, వద్ది గోపీచంద్,ఐటీ వింగ్ నాగ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img