Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పవన్ ను విమర్శించే స్థాయి జోగి. రమేష్ కు లేదు

విశాలాంధ్ర – గూడూరు : పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి.రమేష్ విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ధ్వజమెత్తారు. గూడూరు మండలం శారద పేటలోని జనసేన పార్టీ నాయకులు కనపర్తి, వెంకన్న ఇంటి వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సమ్మెట. బాబు మాట్లాడుతూ పెడన నియోజకవర్గం లోని ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారని దాల్వ పంటకు వరి సాగుకు అనుమతులు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం అవటం వలన సార్వాపంట వేసిన తరువాత దాల్వా పంట ఉప్పు నేలపై సారవంతం పెరిగి సాగుకు పనికిరాకుండా పోతుందని దానివల్ల రైతులు నష్టపోతారన్నారు. కాబట్టి ధాల్వాకు అనుమతి ఇవ్వాల్సిందే అని మంత్రి జోగు రమేష్ ని జిల్లా కలెక్టర్ ను సంబంధిత అధికారులను కోరారు.
గూడూరు జడ్పీ పాఠశాలలో కాంట్రాక్టర్లు మాయాజాలం :
కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై లక్షల్లో స్వాహా చేశారని, నిర్మించని తరగతి గదులకు బిల్లులు పెట్టారని, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పేరుట నకిలీ లేఖను సృష్టించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోలేదని అధికార పార్టీ నాయకులే వ్యాఖ్యానించటం గమనించదగ్గ అంశం. అక్రమాలు తేల్చే వరకు ఈ విషయం వదిలిపెట్టేది లేదని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బట్టు .లీలా కనకదుర్గ, బత్తిన .హరి రామ్, పన్నెంనేని. శ్రీనివాస్ రావు, వుచ. వెంకయ్య, చీరల. నవీన్ కృష్ణ, కనపర్తి వెంకన్న, శిీరం. సంతోష్, గల్లా. హరీష్, రామకృష్ణ గణపతి ,చిన్ని, శివ, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img