Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మైలవరం సీఐగా మోహన్ రెడ్డి

విశాలాంధ్ర-విజయవాడ క్రైం : మైలవరం సీఐగా దీకేఎన్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాజా టాటా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైలవరం సీఐగా ఉన్న ఎల్. రమేష్ ను వీఆర్ (సీఎస్బీ) కు పంపారు. దీంతో ఆయన స్థానంలో వీఆర్ లో ఉన్న మోహన్ రెడ్డిని సీఐగా నియమించారు.

ఎస్సైల బదిలీలు

విస్సనపేట ఎస్సైగా ఉన్న పీ. కిషోర్ ను సీసీఎస్ కు, భవానీపురం స్టేషను లో ఎస్సైగా ఉన్న జీవీవీ సత్యనారాయణను విస్సనపేటకు బదిలీ చేశారు. మైలవరం ఎస్సైగా ఉన్న రాంబాబును గంపలగూడెం, గంపలగూడెం ఎస్సైగా ఉన్న వీ. సతీష్ ను తిరుపూరుకు బదిలీ చేశారు. తిరువూరు ఎస్పైగా ఉన్న సిహెచ్.కె. దుర్గప్రసాదును వీఆర్ కు పంపుతూ ఉత్వర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img