Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

చోరీ సొమ్ము స్వాధీనం… బాధితులకు అప్పగింత

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: ఇటీవల కాలంలో మండల పరిధిలోని గండ్రాయి గ్రామానికి చెందిన పిల్లి తిరుమల రావు అనే వ్యక్తి స్వగృహంలో 3 లక్షల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు,కాగా చిల్లకల్లు ఎస్సై చిన్నబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టి ముద్దాయిని గుర్తించి వారి దగ్గర నుంచి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.అనంతరం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో బాధితులకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో చోరీ చేసిన ముద్దాయిలను గుర్తించి బాధితులకు వారి బంగారాన్ని అప్పగించిన చిల్లకల్లు ఎస్సై చినబాబుని మరియు వారి సిబ్బందిని అభినందించారు. ఆయన ఇటీవల సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ప్రభుత్వం ద్వారా పలు అవార్డులు అందుకున్నారని భవిష్యత్తులో ఇంకా ప్రతిభను కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ పల్లెబోయిన యలమందరావు,ఉప సర్పంచ్ రాచకొండ రాజు,పిల్లి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img