Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నాయకుల వైఫల్యంతో ఎండమావిగా మారిన
చింతలపూడి ఎత్తిపోతల పథకం

విశాలాంధ్ర – మైలవరం: గత పశ్చిమగోదావరి జిల్లా, క్రిష్ణా జిల్లాలు విభజనానతరం ప్రస్తుతం ఏలూరు ,ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరందించాలన్న లక్ష్యం తో రూపొందించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 , స్టేజ్ 2 లు నిర్మాణం దశలోనే అసంపూర్తిగా ఆగిపోయి ఈ పధకమువలన ఎన్నో ఆశలు పెట్టుకున్న మూఢుజిల్లాలమెట్ట ప్రాంత రైతులకు ఈ పధకము ఎండమావిగా నే మిగిలిపోయిందని సీపీఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కొటేశ్వరవు జిల్లా బృందం తరపున తీవ్రంగా విమర్శించారు,

సిహెచ్ కోటేశ్వరరావు బృందం తరపున జిల్లా సీపీఐ నాయకులు తూము కృష్ణయ్య ,ఎస్కె నాగులమీరా ,బుడ్డి రమేష్, చిలుకూరి వెంకటేశ్వరరావు,యం త్యాగరాజ్, తదితరులతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సీపీఐ బృందం సోమవారం నాడు ఏలూరు జిల్లా చాట్రాయి మండలము లోని చీపురుగూడెం గ్రామంలో గల స్టేజ్ 11 , ఈక్విడెన్ట్ ను పరిశీలించి న తర్వాత నే మంగళవారం నాడు వివరాలు విలేకరులకు తెలిపారు,

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వం లో ఈ నెల 13 వ తేదీనుంచి రాష్ట్రంలో ని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా 20 సోమవారం నాడు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తున్న వలన సీపీఐ ఎన్టీఆర్ జిల్లాబృందం చీపురుగుడెం ,ఈక్విడెన్ట్ ను చేరుకుని పోలవరము ప్రాజెక్ట్ పథకము పరిశీలన ఎక్కువ సమయం పడుతుండటంతో ఇక్కడికి రాలేక పోయారని మరొక రోజుకు వాయిదా వేసిన కారణంగా జిల్లా బృందం పరిశీలించుట జరిగినది కోటేశ్వరరావు తెలిపారు,

అక్విడేట్ జమ్మి గడ్డిలో , పాడుబడిన కట్టడాలతోజోగుతుందని కాలువ తవ్వకాలలో సహా సంవత్సరం తరబడి ఆగిపోవడం ఈ ప్రభుత్వమునకు పధకాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదని తెలియజేస్తూ ఎంతోమంది రైతులు తమ భూములను అప్పగించారని ఈ ప్రాజెక్టు పూర్తి ఐతే ఎంతో మంది రైతులు వ్యవసాయ మా ప్రాంతాల్లో చెరువుల ను నీటితో నింపి చెరువు నింపి రిజర్వయువులుగా మార్చడం వలన భూగ ర్భజలాలు అభివృద్ధిఐ సాగునీటి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందని, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ జిల్లాలో ని మెట్టప్రాంత రైతులు సామాన్య ప్రజలకు ఈ పధకం ఎండమావిగానే మిగిలిపోయిందని కావున ఇప్పటికయిన యూద్ధప్రాతిపదికన ప్రభుత్వం ఈ పధకనిర్మాణం ను పూర్తి చేసి ఈ మూడు జిల్లా ల అభివృద్ధి కి తోడ్పడాలని ఈ ప్రకటన ద్వారా సీపీఐ బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img