Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మంగు తెగులుతో మసగ బారిన మామిడి పంట ప్రభుత్వమే ఆదుకోవాలి

సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు

విశాలాంధ్ర – మైలవరం : ఈ మామిడి పంట సీజన్ లో మంగుతెగులు సోకి మామిడి కాయలు పింది సైజ్ నుంచి కోతకు వచ్చిన సైజ్ వరకు నల్లగా మసగబారి కొనే దిక్కు లేని పరిస్థితులు మామిడి రైతాంగం విలవిల్లాడుతున్నారని ఈ విపత్కర పరిస్థితుల్లో నుండి వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు,

మైలవరం నియోజకవర్గ పరిధిలోని మామిడితోటలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక సీపీఐ నాయకులతో కలిసి శుక్రవారంనాడు సీహెచ్ కోటేశ్వరరావు పర్యటించి తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు,

కాయలు కొమ్మలతో సహా నల్ల బంక తెగులుతో చూడటానికి పట్టుకోవడానికి కూడా వీలుకానంతగా ఈ తెగులుపట్టి పీల్చి వేస్తున్నదని కొన్ని ప్రాంతాల్లో రంగుకుడా మారి సపోటా కాయరంగులో మారి ఇవి మామిడికాయ లేనా అని గుర్తు పట్టలేని పరిస్థితిలో పనికి రాకుండా పోయాయని కోటేశ్వరరావు తెలియారు,

ఈ తెగులుకు ఆజ్యం పోసినట్లు మంచుకూడా విపరీతంగా తోడ్పడటం తో ఈ తెగులు మరింత ఎగబాకి ఈ సంవత్సరం మామిడి పంట దిగుబడికి తీవ్రమైన ఆటంకము ఏర్పడిందని ప్రభుత్వమే స్పందించి తక్షణమే నివారణకు తగు చర్యలు చేపట్టాలని కోటేశ్వరరావు ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు, 

కోటేశ్వరరావు తోపాటు ఆయా మండలాల సీపీఐ నాయకులు అడపా సుబ్బారావు , జె వెంకటేశ్వరరావు ,డి నందియ్య, బుడ్డియ్య, నాగు, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img