Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వత్సవాయి పెట్రోలు బంకుల్లో మోసాలు ఆగేనా

. డీజిల్‌, పెట్రోల్‌ పంపింగ్‌లో వ్యత్యాసం
. గాలి మిషన్లు పని చేయని వైనం
. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దక్కని న్యాయం
. పలు బంకుల్లో సిబ్బంది చేతివాటం
. కొంచెం ట్యూటీ… ఎక్కువ పైసలు

ఎన్టీఆర్ జిల్లా – వత్సవాయి :ప్రస్తుత రోజుల్లో వాహనం ఓ నిత్యావసర వస్తువుగా మారింది. గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీ సీ బస్సులు, రైల్వేను ఆశ్రయించే వారు. కరోనా మహమ్మారి భయంతో పెద్దఎత్తున వాహనాలను వినియోగిస్తూ ప్రజలు తమ పనులకు అలవాటు పడినారు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి……… అయితే వాహనం నడవాలంటే పెట్రోల్‌, డీజిల్‌ కీలకం. ఈ ఇంధనాలు సైతం ప్రస్తుతం లీటరుకు రూ.100కు పైనే చేరువ కావడంతో తమ బడ్జెట్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ బం క్‌లో పెట్రోల్‌, డీజిల్‌ను వాహనాలలో పోయించుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అసలే ధరల పెరుగుదల ఒకవైపు.. ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని నెట్టుకొస్తుంటే వత్సవాయి మండలంలో కొన్ని బంక్‌ల నిర్వాహకులు ప్రజలను మరింత మోసం చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100 ఎంఎల్‌ నుంచి 250 ఎంఎల్‌ వరకు తక్కువగా పోస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు…… ఆటోవాలాలు, ద్విచక్ర వాహనదారులు నిత్యం బంక్‌లు చేసే మోసానికి బలైపోతున్నారు. ఎక్కువ మైలేజ్ రావాల్సిన వాహనాలు కూడా తక్కువ మైలేజ్ రావడంతో మెకానిక్‌ల వద్దకు వెళితే మైలేజ్‌కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని కేవలం పెట్రోల్‌ బంక్‌ల నిర్వాహకులు చేసే మోసంతోనే వాహనం మైలేజ్‌ తక్కువగా వస్తోందని సమాధానం ఇస్తుం డడంతో ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది…… పెట్రోల్ బంకుల్లో స్కూటీలు స్కూటర్లు ఎక్సెల్ వాహనాల్లో పెట్రోల్ తో పాటు ట్యూటీ కూడా పోయవలసి వస్తుంది ఇది గమనించిన బంకు సిబ్బంది దీనిని అదునుగా భావించుకొని కొద్దిపాటి టూటీని పోసి ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారు….మండలంలో రైతు వారి పనులు నిర్వహించుకునేవారు ఎక్సెల్ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పరిస్థితిని బంకు సిబ్బంది అదునుగా మార్చుకొని తమ చేతివాటాన్ని నిరూపించుకుంటున్నారు .పెట్రోల్‌, డీజిల్‌ వ్యత్యాసంలో బంక్‌ నిర్వాహకులను ప్రశ్నించినప్పుడల్లా ఎదురుదాడికి దిగడం.. మీకు నచ్చిన వారికి చెప్పుకొండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తీరా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినా కాలయాపన చేయడం, లేదంటే తూతూ మంత్రంగా చర్యలకు ఉపక్రమిస్తుండడంతో బంక్‌ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు….. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కొనుగోలు చేసే ఇంధనంలోనే ఫ్రీ ఎయిర్ ఫిల్లింగ్ మరియు మరుగుదొడ్లు ఇతరత్రాలు ఇంధనం కొనుగోలుదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఇంధన వినియోగదారులు ( వాహనదారులు ) కోరుతున్నారు…..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img