విశాలాంధ్ర ` నందవరం : అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తన అన్న అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధికార మదంతో రౌడీలా ప్రవర్తించడం సరికాదని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జి. కృష్ణతేజ నాయుడు అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని వచ్చి ఉపాధి కల్పించడం చేతకాదు కానీ ఇదేంటని ప్రశ్నించిన వారిపై గుండాయిజం చేయడం వైసిపి నాయకులకు పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. గతంలో టిడిపి పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు కనుసైగ చెసింటే మీరు మీ వైసిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసేవారా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వాపోయారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ టిడిపి అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి గౌ శ్రీ నారా లోకేష్ గారికి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంజిత్, శేఖర్, రంజిత్, నరేష్, ఉమేష్, ఈరన్న, వీరేష్, పవన్, తేజ, వెంకట్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.