Monday, May 29, 2023
Monday, May 29, 2023

ఆర్ సీఎం చర్చి ఆధ్వర్యంలో సిలువ యాత్ర

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో గుడ్ ఫ్రైడే వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు ఆధ్వర్యంలో సిలువ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ సి ఎం చర్చి నుండి క్రైస్తవ కాలనీలోని పురవీదుల గుండా క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ ఏసు సిలువపై పలికిన మాటలను ధ్యానిస్తూ, ప్రార్థనలు చేస్తూ సిలువ యాత్రలో భాగంగా ఫాదర్ సంజీవరావు సిలువ మోశారు. ఈ సిలువ యాత్రలో సంఘ పెద్దలు, మహిళలు, అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img