Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఎమ్మెల్సీ చే కవి గద్వాల సోమన్నకు సన్మానం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను మంగళవారం ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు సాహిత్యంలో వారి విశిష్ట సేవలకు ఘనంగా సన్మానించారు. అనంతరం కవి గద్వాల సోమన్న రచించిన 30 పుస్తకాలను నరసింహారెడ్డికి బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జయరాజు, లక్ష్మీనారాయణ, నారాయణ నాయక్, శ్రీనివాసులు, తాయప్ప, పాండురంగ, రామకృష్ణుడు, వినోద్, ఆంజనేయులు, బాబయ్య, ప్రసన్న రాజు, జనార్ధన్, అడివన్న, ఈరన్న, పౌలన్న, తులసి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img