Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం పరిశీలన

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మార్చి 13న జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దకడబూరు మండలంలో పట్టభద్రులు మొత్తం 584 మంది, ఉపాధ్యాయులు 8 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు జరుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఎమ్మారై మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img