Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఎస్ఈఐఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా సోమన్న

విశాలాంధ్ర- పెద్దకడబూరు :మండల పరిధిలోని హెచ్ మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఃస్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ః కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ డా. ఈదా శామ్యూల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎస్ఈఐఎఫ్ జిల్లా కోశాధికారిగా గద్వాల సోమన్న పనిచేసినట్లు తెలిపారు. ఃబలవన్మరణాలు లేని భారతదేశంగాః చూడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న ఈ ఫౌండేషన్ కు ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడం పట్ల సోమన్న సంతోషం వ్యక్తం చేశారు. మహోన్నత ఆశయాలతో చిత్త శుద్ధితో అడుగులు వేస్తున్న నిస్వార్థ సేవా సంస్థతో కలిసి పనిచేయడం మధురానుభూతిగా అభివర్ణించారు. తన మీద నమ్మకంతో ఎస్ఈఐఎఫ్ ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసినందుకు చైర్మన్ శామ్యూల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సోమన్నను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img