Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

గుండెపోటుతో వ్యక్తి మృతి

విశాలాంధ్ర`పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో కురువ మహాదేవ (41)అనే వ్యక్తి సోమవారం ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేష్‌ గౌడ్‌, నర్సింహులు, ఉప సర్పంచ్‌ మహేష్‌, నాయకులు హనుమంతు, బద్రి, మాల శివ, చంద్ర, బ్రహ్మయ్య, భీరలింగ, తిక్కయ్య, నాగప్ప, మహాదేవలు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చులకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img