Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

గోవుల సంరక్షణ అందరి బాధ్యత

సర్పంచ్ మూలింటి రాధమ్మ
షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

విశాలాంధ్ర- ఆస్పరి : గోవులను సంరక్షించాల్సిన బాద్యత మనందరిపై ఉందని సర్పంచ్ మూలింటి రాధమ్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీ మారెమ్మ అవ్వ దేవాలయానికి చెందిన గోవుల నివాసం కోసం గోశాల షెడ్డు నిర్మాణానికి సర్పంచ్ మూలింటి రాధమ్మ, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, సింగిల్ విండో మాజీ చైర్మన్ కేశవరెడ్డి, ఎంపీటీసీ మహాలక్ష్మి భర్త తిమ్మప్ప, గ్రామ పెద్దల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాత ఒక భాగమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనంతో గోవు మమేకమయిందన్నారు. ఇటీవలి కాలంలో అనేకచోట్ల గోసంరక్షణ కేంద్రాలు వెలుస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. గోవును పూజించడం అంటే భగవంతుడిని ఆరాధించడమేనని, గోవుల సంరక్షణకు దాతలు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మూలింటి చంద్రశేఖర్, చక్రాల శ్రీనివాసులు, గోవిందు, మానందమ్మ, వీరేష్, బండమీద రామాంజనేయులు, ఆలయ పూజారి శివ, నాగార్జున, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img